గచ్చిబౌలి: ఐటీ కారిడార్ లో విదేశీ మహిళలతో వ్యభిచారం

 గచ్చిబౌలి: ఐటీ కారిడార్ లో విదేశీ మహిళలతో వ్యభిచారం
  •     హోటల్​ మేనేజర్​తో పాటు విటుడు అరెస్ట్​ 
  •     ఢిల్లీకి చెందిన ఆర్గనైజర్​ ఉద్యోగాల పేరుతో తీసుకొచ్చినట్లు గుర్తింపు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. గచ్చిబౌలిలోని డ్రీమ్ ప్రైడ్ హోటల్ కేంద్రంగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్​ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు గురువారం రైడ్​చేశారు. మూడు గదుల్లో తుర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెనిస్తాన్ దేశానికి చెందిన ఇద్దరు మహిళలు, ఉజ్బెకిస్తాన్​కు చెందిన ఒక మహిళతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 

ఢిల్లీకి చెందిన ప్రధాన ఆర్గనైజర్​నిఖిల్​అలియాస్​ సన్నీ విదేశాల్లోని మహిళల ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఉద్యోగాల పేరుతో ఇండియాకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు తేల్చారు. హోటల్ మేనేజర్​మారం మోహన్​రెడ్డి సబ్​ఆర్గనైజర్​గా వ్యవహరిస్తూ 30 శాతం కమీషన్​తీసుకుంటూ సహకరిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. బాధిత మహిళలను రెస్క్యూ చేసి, హోటల్​మేనేజర్ తోపాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.