జైలర్ను భయపెడుతున్న గదర్2.. ఒక్కరోజులోనే టాప్లోకి

జైలర్ను భయపెడుతున్న గదర్2.. ఒక్కరోజులోనే టాప్లోకి

గదర్2(Gadar2).. బాలీవుడ్ హీరో సన్నీ డియోల్(Sunny Deol) హీరోగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. దేశభక్తి కథాంశంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మనసులను కదిలించింది. దీంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు.కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. టైర్2 హీరోతో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు విషయం కాదు.   

ఈ క్రమంలో గదర్2 సినిమా సూపర్ స్టార్ రజనికాంత్(Rajinikanth)  జైలర్(Jailer) సినిమాను సైతం బీట్ చేసే దిశగా దూసుకుపోతోందో. ఆగస్టు 10న వచ్చిన జైలర్ మూవీ ఇప్పటివరకు రూ.390 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. నిజానికి ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ వేరు. కాబట్టి ఆయన సినిమాకు ఆ రేంజ్ కలెక్షన్స్ రాబాట్టడం అనేది మాములు విషయమే. కానీ స్టార్ హీరోల పోటీలో లేని సన్నీ డియోల్ సినిమా రేంజ్ లో కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఈ విషయంలో సన్నీ డియోల్ రజనీకాంత్ కు టఫ్ ఫైట్ ఇస్తున్నారు. 

ఇక ఆగస్టు 15 కూడా గదర్ 2 సినిమాకు బాగా కలిసొచ్చింది. దేశభక్తి  కథాంశంతో వచ్చిన సినిమా కాబట్టి ఆరోజు గదర్2 చూసేందుకు ఆయాయన్స్ ఇంట్రెస్ట్ చూపించారు. కేవలం ఆగస్టు 15న ఒక్కరోజే రూ.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది గదర్2 మూవీ. ఈ ఒక్క ఎగ్జామ్పుల్ చాలు దేశవ్యాప్తంగా గదర్2 మూవీ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చెప్పడానికి. ఇక బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టుల ప్రకారం ఈ సినిమా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరనుందట.