హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (టీజీజీడీఏ–మోడరన్ మెడిసిన్) 2026–2028 కాలానికి సంబంధించి నిర్వహించిన రాష్ట్ర ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అన్ని కీలక పదవులకు ఒక్కొక్కరే బరిలో నిలిచారు. దీంతో పోటీలో ఉన్న వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ డాక్టర్ ఆవుల మురళీధర్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు.అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ బి. నరహరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అలాగే సెక్రటరీ జనరల్‌గా డాక్టర్ ఆర్. లాలు ప్రసాద్, ట్రెజరర్ (కోశాధికారి)గా డాక్టర్ ఎ. లక్ష్మీనారాయణ ఏకగ్రీవమయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా బి. ఉమాకాంత్ గౌడ్ (సివిల్ సర్జన్), డాక్టర్ ఏ. శ్రీకృష్ణారావు (డిప్యూటీ సివిల్ సర్జన్), డాక్టర్ ఆర్. దీన్ దయాల్ (సివిల్ అసిస్టెంట్ సర్జన్), డాక్టర్ సీహెచ్. కళ్యాణ్ (ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్) ఎన్నికయ్యారు.అదేవిధంగా అసోసియేషన్ సెక్రటరీలుగా డాక్టర్ జె. భూపేందర్ సింగ్ రాథోడ్, డాక్టర్ కె. రమేష్, డాక్టర్ ఎం. విష్ణు వర్ధన్, డాక్టర్ వి. రవి ప్రవీణ్ రెడ్డి, డాక్టర్ ఏ. విశాల్ ఖరారయ్యారు. సీఈసీ సభ్యులుగా డాక్టర్ కె. రామ్ సింగ్, డాక్టర్ చింతా రమేష్, డాక్టర్ బాబు రత్నాకర్, డాక్టర్ పి. అబ్బయ్య తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
