వికారాబాద్, వెలుగు: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా గడ్డం అనన్య ఉంటారని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం తన క్యాంపు ఆఫీసులో ఆయన మాట్లాడారు. ఎస్సీ మహిళ రిజర్వ్ అయినందున సీనియర్ నాయకుల అభీష్టంతో తన కూతురును బరిలో దింపుతున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు పోటీ చేయబోమని స్పష్టం చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 27న వచ్చే అవకాశం ఉందన్నారు.
