బ్లాక్ టికెట్ల దందాను అడ్డుకోవాలి : గడ్డం నవీన్

బ్లాక్ టికెట్ల దందాను అడ్డుకోవాలి :  గడ్డం నవీన్

ముషీరాబాద్, వెలుగు: సినిమా హాల్స్​వద్ద బ్లాక్ టికెట్ల దందాను అడ్డుకోవాలని బీజేవైఎం ముషీరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గడ్డం నవీన్ డిమాండ్ చేశారు. హాల్స్​నిర్వాహకులే బ్లాక్ టికెట్ల అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్​లోని సంధ్య థియేటర్​వద్ద నిరసనకు దిగారు. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గురువారం రిలీజ్​కాబోతున్న ‘కల్కి’ సినిమా టికెట్లను రెండు రోజుల ముందుగా బ్లాకులో అమ్మేశారని ఆరోపించారు. నిరసనలో బీజేవైఎం నాయకులు అజయ్, నవీన్, రమేశ్, నంద రాజు, శశి, నాని తదితరులు పాల్గొన్నారు.