
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎంపిక జరిగిపోయింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ గా ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీలో గడ్డం ప్రసాదరావు సీనియర్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అప్పట్లో ప్రసాదరావు చేనేత, చిన్న తరహా పరిశ్రలమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1964లో వికారాబాద్ జిల్లా మర్పల్లి గ్రామంలో జన్మించిన ప్రసాదరావు.. తాండూరులో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో.. చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా కూడా ఉన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచి.. ఇప్పుడు స్పీకర్ గా ఎన్నికయ్యారు గడ్డం ప్రసాద్ కుమార్..