అంబేద్కర్, జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం : గడ్డం ప్రసాద్ కుమార్​ 

అంబేద్కర్, జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం : గడ్డం ప్రసాద్ కుమార్​ 

మల్కాజిగిరి​, వెలుగు: దేశ భవిష్యత్ తరాలకు రాజ్యాంగ నిర్మాతగా.. సామాజిక న్యాయం కోసం బీఆర్ అంబేద్కర్​ చేసిన కృషి, త్యాగం చిరస్మరణీయమని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్ కొనియాడారు. అంబేద్కర్, జగ్జీవన్​రామ్​విగ్రహాలను ప్రతిష్టించడమంటే.. వారి అత్యున్నత ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియపర్చడమేనని పేర్కొన్నారు.

మల్లాపూర్ ఎలిఫెంటా సర్కిల్, కాప్రా సర్కిల్ లో అరుంధతి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు.  కార్యక్రమంలో ఉప్పల్​ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, హెచ్​బీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య, ఎమ్మార్పీఎస్​ నేతలు పాల్గొన్నారు.