స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు

స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారు
  • అమరుల త్యాగాలు మరువలేనివి
  • గడ్డం సరోజా వివేకానంద్​  

కరీంనగర్, వెలుగు: పిల్లలకు దేశ, తెలంగాణ స్వాతంత్ర్య చరిత్ర  గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందని నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యదర్శి, విశాక ఇండస్ట్రీస్​ ఎండీ  గడ్డం సరోజా వివేకానంద్ అన్నారు. శనివారం కరీంనగర్​లోని జ్యోతి నగర్ లో  వివేకానంద విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. -స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పించారని.. ఇందులో హిందూ,  ముస్లింలు అందరూ ఉన్నారని అన్నారు.  కానీ - బ్రిటిష్ హయాంలో వీరందరిని  విభజించి పాలించారని చెప్పారు. అందరూ ఎంతో  కష్టపడి ఒక్కటై పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చారన్నారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో తెలంగాణకు విముక్తి లభించిందన్నారు. అమరుల త్యాగాలు మరువలేనివన్నారు. మనకు దక్కిన స్వాతంత్రాన్ని  కాపాడుకోవాలన్నారు. ఇది నిజాం విముక్త స్వాతంత్ర దినోత్సవం అన్నారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి  కరీంనగర్  జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ భాగ్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, నాగమల్ల సురేశ్, సంపత్ కుమార్,  వేణుగోపాల్ రావు, బొడ్ల గీతారాణి,  స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ, బేతి మహేందర్ రెడ్డి, గాజుల  స్వప్న పాల్గొన్నారు.