పేదోళ్ల లీడర్ కాకా : అంకేశ్వరపు రామచందర్ రావు

పేదోళ్ల లీడర్ కాకా : అంకేశ్వరపు రామచందర్ రావు

వరంగల్​సిటీ/నర్సింహులపేట/మహాముత్తారం/మహబూబాబాద్ అర్బన్, వెలుగు : ఉమ్మడి వరంగల్​జిల్లాలోని వేర్వురు చోట్ల శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి(కాకా) వర్ధంతి నిర్వహించారు. కాకా ఫొటోకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. గ్రేటర్​వరంగల్​మాల మహానాడు అధ్యక్షుడు అంకేశ్వరపు రామచందర్ రావు ఆధ్వర్యంలో వరంగల్​లో వెంకటస్వామి, పీవీ రావు వర్ధంతి నిర్వహించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

నాయకులు మన్నెబాబురావు, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సింగారపు రవి ప్రసాద్, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు రౌతు రమేశ్, బండి అశోక్, దామ రవి, దండ్రే శ్రీనివాస్, బండి రజనీకుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాకా వర్ధంతి నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాకా ఎంతో కృషి చేశారని కొనియాడారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం స్తంభంపల్లిలో కాంగ్రెస్​నాయకులు, గ్రామస్తులు కాకా వర్ధంతి నిర్వహించారు.

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, రాజకీయ భీష్మ కాకా అని కొనియాడారు. చివరి శ్వాస వరకు పేదల కోసమే పనిచేశారని, సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మాల మహానాడు స్టేట్ లీడర్ మెరుగు పాపారావు, యూత్ కాంగ్రెస్​లీడర్లు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్​నాయకులు కాకా వర్ధంతి నిర్వహించారు. టీపీసీసీ ఎస్టీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గుగులోత్ వెంకట్ నాయక్ మాట్లాడుతూ..

కాకా హైదరాబాద్​లోని అడ్డా కూలీల కోసం, సింగరేణి కార్మికుల పక్షాన కొట్లాడారని గుర్తుచేశారు. జాతీయ గుడిసెల సంఘం స్థాపించి ముషీరాబాద్ గుడిసె పోరాటంలో బుల్లెట్ గాయాలపాలయ్యారన్నారు. 80 వేల మంది పేదలకు నీడ కల్పించిన మహోన్నత నేత కాకా అని కొనియాడారు.