
- బెస్ట్ ఫిల్మ్‌గా కల్కి 2898 ఏడీ
- రెండో ఉత్తమ చిత్రంగా పొట్టేల్
- బెస్ట్ థర్డ్ ఫిల్మ్‌గా లక్కీ భాస్కర్
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం అవార్డుల ప్రకటన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు చలనచిత్ర పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అవార్డులు ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ 14 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందించనుంది.
2024లో వచ్చిన సినిమాలకు జ్యూరీ చైర్మన్ జయసుధ, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్ రాజు గురువారం విజేతల వివరాలను ప్రకటించారు. మొత్తం 1,248 నామినేషన్లు రాగా.. 11 కేటగిరీల్లో అవార్డులను ప్రకటించారు. వీటిలో పుష్ప2 చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్‌ను ఎంపిక చేశారు. బెస్ట్ ఫస్ట్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’, బెస్ట్ సెకండ్ ఫిల్మ్ గా ‘పొట్టేల్’, బెస్ట్ థర్డ్ ఫిల్మ్ గా ‘లక్కీ భాస్కర్’ చిత్రాలను సెలెక్ట్ చేశారు.
గౌరవంగా భావిస్తున్నా : అల్లు అర్జున్
ఉత్తమ నటుడిగా గద్దర్ అవార్డుకు ఎంపికవడంపై నటుడు అల్లు అర్జున్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డును గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన గౌరవాన్ని అందించిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రెడిట్ అంతా మూవీ దర్శకుడు సుకుమార్, నిర్మాతలతో పాటు ‘పుష్ప’ టీం అందరికీ చెందుతుందన్నారు. అవార్డును అభిమానులకు అంకితం చేశారు.
విజేతల వివరాలు..
- బెస్ట్ ఫిల్మ్ : కల్కి 2898 ఏడీ
- బెస్ట్ సెకండ్ ఫిల్మ్ : పొట్టేల్
- బెస్ట్ థర్డ్ ఫిల్మ్ : లక్కీ భాస్కర్
- ఉత్తమ నటుడు : అల్లు అర్జున్(పుష్ప 2)
- ఉత్తమ నటి : నివేదా థామస్ (35)
- ఉత్తమ దర్శకుడు : నాగ్ అశ్విన్ (కల్కి)
- నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ : కమిటీ కుర్రోళ్ళు
- బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ : 35 ఇది చిన్న కథ కాదు
- ఫీచర్ ఫిల్మ్ ఆన్ హిస్టరీ : రజాకార్
- బెస్ట్ స్క్రీన్ ప్లే : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
- బెస్ట్ ఎడిటర్ :నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
- స్పెషల్ జ్యూరీ అవార్డు హీరో : దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
- స్పెషల్ జ్యూరీ అవార్డు హీరోయిన్ : అనన్య నాగళ్ళ (పొట్టేల్)