ప్రజా యుద్ధనౌక గద్దర్ డిమాండ్‌‌‌‌

ప్రజా యుద్ధనౌక గద్దర్ డిమాండ్‌‌‌‌

ఖైరతాబాద్, వెలుగు: కొత్త పార్లమెంట్ బిల్డింగ్‌‌‌‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా యుద్ధనౌక గద్దర్ డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌‌‌‌ క్లబ్‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి దిక్సూచి అయిన రాజ్యాంగాన్ని రచించిన ప్రపంచ మేధావి అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంట్‌‌‌‌ భవనానికి పెట్టాలని కోరారు. కాగా, కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కృషి చేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గద్దర్ కోరారు. సోమవారం ఉత్తమ్ నివాసంలో ఆయనను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించి ఉత్తమ్‌‌‌‌.. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాంటి పార్లమెంట్‌‌‌‌కు అంబేద్కర్ పేరు పెట్టడం అన్ని విధాలా సమంజసమన్నారు. ఈ విషయాన్ని లోకసభ స్పీకర్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్తానని, పార్లమెంట్‌‌‌‌లో కూడా ప్రస్తావిస్తానని ఉత్తమ్ గద్దర్‌‌‌‌‌‌‌‌కు హామీ ఇచ్చారు.