నా వయస్సు 76.. నా తూటా వయస్సు 25 ఏండ్లు : గద్దర్ చివరి లేఖ

నా వయస్సు 76.. నా తూటా వయస్సు 25 ఏండ్లు : గద్దర్ చివరి లేఖ

ప్రజాగాయకుడు గద్దర్‌ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్​ ఒకటి బయటపడింది. 2023, జులై 31న అపోలో మేనేజింగ్​ డైరెక్టర్(ఎండీ)కు గద్దర్​ రాసిన లేఖ సోషల్​ మీడియాలో తెగ వైరల్ గా మారింది. లేఖలో ఆయన తన ఆరోగ్య విషయాలు చెప్పారు. తాను చికిత్స తీసుకుంటున్నానని.. ఆరోగ్యం కుదుటపడుతోందని రాశారు. అపోలో ఎండీకి గద్దర్ రాసిన లేఖలో ఏముందంటే..!

నా పేరు గుమ్మడి విఠల్

నా పాట పేరు గద్దర్ 

బతుకే నా పోరాటం

నా వయసు 76 ఏండ్లు

నా వెన్నుపూసలోని తూటా వయస్సు 25 ఏండ్లు

ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా మా భూములు మాకే అనే నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను.

నా పేరు జనం గుండె చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ.. ఎందుకో గుండెకు గాయం అయ్యింది.

ఈ గాయానికి చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరాను.

జులై 20 నుంచి నేటి వరకు అన్ని రకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటున్నాను

పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను అంటూ గద్దర్ ఆ​లేఖలో రాశారు.