గద్దర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలి ..తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్

గద్దర్ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లాలి ..తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ వెన్నెల గద్దర్

అల్వాల్ వెలుగు: ప్రజా యుద్ధనౌక గద్దర్​ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్​ జి.వి.వెన్నెల గద్దర్ అన్నారు. బుధవారం స్థానిక వెంకటాపురం మహా బోధి విద్యాలయంలో గద్దర్​ రెండో వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమానికి విమల హాజరై గద్దర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టూడెంట్స్​ క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు. మహా బోధి విద్యార్థి మాస్టర్ ప్రతీక్  దక్షిణ కొరియలో జరిగిన 20వ ఆసియా స్కేటింగ్ చాంపియన్ లో ఫస్ట్​ ప్లేస్​లో నిలిచినందుకు మెడల్స్ బహూకరించారు. విద్యార్థులు ‘నిండు అమాస, పొడుస్తున్న పొద్దు, బండెన్క బండి కట్టి’ పాటలు పాడుతూ గద్దర్​కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ట్రస్ట్ సభ్యులు, టీచర్లు పాల్గొన్నారు.