Gaddar Film Awards: పదేండ్ల (2014 నుంచి 2023) సినిమాలకు గద్దర్ అవార్డులు.. ఫుల్ లిస్ట్ ఇదే

Gaddar Film Awards: పదేండ్ల (2014 నుంచి 2023) సినిమాలకు గద్దర్ అవార్డులు.. ఫుల్ లిస్ట్ ఇదే

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు తొలిసారిగా అవార్డులు ప్రకటిస్తున్నారు. గురువారం (మే 29న) 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు అనౌన్స్ చేశారు.

ఈ క్రమంలోనే 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను నేడు (మే30న) ప్రకటించారు. జ్యారీ చైర్మన్ మురళీ మోహన్ ఆధ్వర్యంలో 2014 జూన్ 2 నుంచి  2023 డిసెంబర్ 31 వరకు సెన్సార్ ఐనా సినిమాలను అనౌన్స్ చేశారు.

అలాగే, ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, పైడి జయరాజ్, ప్రభాకర్ రెడ్డి తదితరుల పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాల విజేతలను సైతం మురళీ మోహన్ ప్రకటించారు. జూన్‌ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం చేయనున్నారు.

2014 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ శర్వానంద్ (  రన్ రాజా రన్)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (పాఠశాల)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (అల్లుడు శీను)

2015 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (రుద్రమదేవి)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (కంచె)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (శ్రీమంతుడు)

2016 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (శతమానం భవతి) 

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (పెళ్లి చూపులు)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (జనతా  గ్యారేజ్) 

2017 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (బాహుబలి ది కన్‌క్లూజన్) 

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (ఫిదా)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (ఘాజీ)

2018 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (మహానటి)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (రంగస్థలం)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (కేరాఫ్ కంచరపాలెం) 

2019 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (మహర్షి)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (జెర్సీ)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (మల్లేశం) 

2020 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (అలా వైకుంఠపురంలో)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (కలర్ ఫోటో) 

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (మిడిల్ క్లాస్ మెలోడీస్) 

2021 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (RRR)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (అఖండ)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (ఉప్పెన)

2022 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (సీతారామం)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (కార్తికేయ 2)

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (మేజర్)

2023 బెస్ట్ ఫిల్మ్:

ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ (బలగం)

సెకండ్ బెస్ట్ ఫిల్మ్ (హనుమాన్) 

థర్డ్ బెస్ట్ ఫిల్మ్ (భగవంత్ కేసరి) 

స్పెషల్ జ్యూరీ అవార్డస్:

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్- బాలకృష్ణ 

పైడి జైడిరాజ్ అవార్డ్- మణిరత్నం 

బిఎన్ రెడ్డి అవార్డ్- సుకుమార్

నాగిరెడ్డి చక్రపాణి- చందర్ రావు

కాంతారావు అవార్డ్- విజయ్ దేవర కొండ

రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్- యండమూరి వీరేంద్రనాథ్.

ఇకపోతే 2024 ఏడాదికి గానూ ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి నిలిచింది. ఉత్తమ రెండోవ చిత్రంగా పోట్టేల్, మూడవ చిత్రం లక్కీ భాస్కర్ స్థానం దక్కించుకుంది. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప 2)కు గద్దర్ అవార్డు  వరించింది.