విజయ్‌ దేవరకొండకు కాంతారావు అవార్డ్.. 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులు ప్రకటన

విజయ్‌ దేవరకొండకు కాంతారావు అవార్డ్.. 2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులు ప్రకటన

తెలుగు చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తొలిసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది.  2024లో వచ్చిన సినిమాల్లోని అన్ని కేటగిరీలకు గురువారం అవార్డులను ప్రకటించగా..  2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు బెస్ట్ ఫిలిం అవార్డులను శుక్రవారం  ప్రకటించారు. ఈ పదేండ్ల సినిమాలకు సంబంధించి ఏడాదికి మూడు  ఉత్తమ చిత్రాల చొప్పున  అవార్డులను ప్రకటించారు.  సినీ నటుడు, జ్యూరీ చైర్మన్ మురళీ మోహన్, ఎఫ్‌‌‌‌డీసీ చైర్మన్ దిల్ రాజు అవార్డుల వివరాలను వెల్లడించారు. అలాగే  ఆరు స్పెషల్ అవార్డులను ప్రకటించారు. వీటిలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు  బాలకృష్ణను ఎంపిక చేయగా, కాంతారావు అవార్డుకు నటుడు విజయ దేవర కొండ,  పైడి జయరాజ్ అవార్డ్‌‌‌‌కు దర్శకుడు మణిరత్నం, బీఎన్‌‌‌‌రెడ్డి అవార్డుకు దర్శకుడు సుకుమార్,  నాగిరెడ్డి– చక్రపాణి అవార్డుకు నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, రఘపతి వెంకయ్య అవార్డుకు రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌‌‌‌లను ప్రకటించారు.

ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ  ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సినిమాలకు అవార్డులు  ఆపేసిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకోవాలని కోరుకుంటాడు. పదేళ్లుగా మేం ప్రయత్నాలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని గద్దర్ అవార్డులను ప్రారంభించడం సంతోషంగా ఉంది.  ఏపీ ప్రభుత్వం కూడా  సినీ అవార్డులను ప్రకటిస్తే బాగుంటుంది.

అయితే  ఒకే సినిమాకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అవార్డులు ఇవ్వడం మంచిది కాదు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలి. ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ ప్రభుత్వాలు పురస్కారాలు ప్రకటించేలా ఆలోచన చేయాలి. తెలుగు సినిమాలకు రెండు రాష్ట్రాలు కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ.. మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా ప్రదర్శితమవుతున్నాయి. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారు’ అని అన్నారు. జూన్ 14న హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్స్‌‌‌‌లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుందని దిల్ రాజు తెలియజేశారు.

‘‘నట ప్రపూర్ణ కాంతారావు పేరిట ఈ గౌరవం లభించడం ఆనందంగా ఉంది. నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన  తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2016లో పెళ్లి చూపులు చిత్రానికి రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ఈ చిత్రానికి నా హృదయంలో ఎల్లప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గౌరవం, ఆనందం నా అభిమానులదే, వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉంది. నా ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబానికి, దర్శకులకు, టీమ్‌‌‌‌కు ధన్యవాదాలు’’.

విజయ్ దేవరకొండ

‘‘ఎన్టీఆర్ శ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యంతి ఉత్సవాలు పూర్తిచేసుకున్న అద్భుత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన ఘ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డియ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఒక వైపు.. నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సత్కరించిన ఇలాంటి త‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ను నాకు ప్రక‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టించ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డం నా అదృష్టం. ఇది దైవ నిర్ణయంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ స‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌భ్యుల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నా కృత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జ్ఞత‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తెలియజేస్తున్నా. ప్రపంచం న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుమూల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ఉన్న తెలుగు ప్రజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల దీవెన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, నాన్న గారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కోరుకుంటున్నా".

బాలకృష్ణ

‘‘ప్రతిష్టాత్మక గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పురస్కారాల్లో బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నన్ను ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి, గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు జ్యూరీకి నా కృతజ్క్షతలు” 

సుకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

2014 ఉత్తమ చిత్రాలు 

  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం : రన్ రాజా రన్ 
  • బెస్ట్ సెకండ్ ఫిలిం : పాఠశాల
  • బెస్ట్ థర్డ్ ఫిలిం : 
  • అల్లుడు శీను 
  • 2015 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  రుద్రమ దేవి
  • బెస్ట్ సెకండ్ ఫిలిం :  కంచె
  • బెస్ట్ థర్డ్ ఫిలిం :  శ్రీమంతుడు
  • 2016 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  శతమానం భవతి
  • బెస్ట్ సెకండ్ ఫిలిం :  పెళ్లి చూపులు
  • బెస్ట్ థర్డ్ ఫిలిం : జనతా గ్యారేజ్ 
  • 2017 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  బాహుబలి 2 
  • బెస్ట్ సెకండ్ ఫిలిం :  ఫిదా
  • బెస్ట్ థర్డ్ ఫిలిం :  ఘాజీ 
  • 2018 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  మహానటి
  • బెస్ట్ సెకండ్ ఫిలిం : రంగస్థలం 
  • బెస్ట్ థర్డ్ ఫిలిం :  కేరాఫ్ కంచరపాలెం
  • 2019 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  మహర్షి 
  • బెస్ట్ సెకండ్ ఫిలిం :  జెర్సీ 
  • బెస్ట్ థర్డ్ ఫిలిం :  మల్లేశం
  • 2020 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  అల వైకుంఠపురంలో
  • బెస్ట్ సెకండ్ ఫిలిం :  కలర్ ఫోటో
  • బెస్ట్ థర్డ్ ఫిలిం : మిడిల్ క్లాస్ మెలోడీస్ 
  • 2021 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం : ఆర్ఆర్ఆర్
  • బెస్ట్ సెకండ్ ఫిలిం :  అఖండ
  • బెస్ట్ థర్డ్ ఫిలిం :  ఉప్పెన
  • 2022 ఉత్తమ చిత్రాలు 
  • బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  సీతారామం
  •  బెస్ట్ సెకండ్ ఫిలిం : కార్తికేయ 2  
  • బెస్ట్ థర్డ్ ఫిలిం :  మేజర్ 
  • 2023 ఉత్తమ చిత్రాలు 
  •  బెస్ట్ ఫస్ట్ ఫిలిం :  బలగం 
  • బెస్ట్ సెకండ్ ఫిలిం :  హనుమాన్ 
  • బెస్ట్ థర్డ్ ఫిలిం :  భగవంత్ కేసరి