బాల్య వివాహాల నిర్మూల నకు కృషి చేయాలి : గద్వాల కలెక్టర్ సంతోష్

బాల్య వివాహాల నిర్మూల నకు కృషి చేయాలి : గద్వాల కలెక్టర్ సంతోష్
  •     గద్వాల కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన రథయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 

2030 నాటికి దేశంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడమే లక్ష్యమని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చాటిన ప్రత్యేక అవసరాల విద్యార్థులను కలెక్టర్ తన ఛాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అభినందించారు.   ఈ కార్యక్రమాల్లో ఏఎస్పీ శంకర్, డీడబ్ల్యూ ఓ సునంద, డీఈవో విజయలక్ష్మి పాల్గొన్నారు.