- గద్వాల కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: ఈ నెల 23న అలంపూర్ ఆలయాలకు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వస్తున్నారని, అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్ లో కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆఫీసర్లతో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. అలంపూర్ లోని హెలిపాడ్ నుంచి ఆలయానికి వెళ్లే రహదారిలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగలు ఏమైనా ప్రమాదకరంగా ఉంటే వాటిని సరి చేయించాలని సూచించారు.
ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో ఇన్ చార్జి ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, ఆర్ అండ్ బీ ఈఈ ప్రగతి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, ఇతర శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు
మీడియా ప్రతినిధులకు 2026–28 అక్రిడిటేషన్లు జారీ జారీ చేసేందుకు జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ సంతోష్ తెలిపారు. జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీలో సభ్యత్వం పొందెందుకు జీవో 252 ప్రకారం మీడియా అసోసియేషన్లు సంఘాలు తమ ప్రతినిధి పేర్లను లెటర్ హెడ్ పై రాసి 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు డీపీఆర్ ఆఫీసులో అందజేయాలని సూచించారు.
