వచ్చే నెలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపెనింగ్ : కలెక్టర్ సంతోష్

వచ్చే నెలలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపెనింగ్ :  కలెక్టర్ సంతోష్
  • గద్వాల కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: వచ్చేనెల మొదటి వారంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ఓపెనింగ్ ఉంటుందని ఆలోపు పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  ప్రజలకు ఇవ్వాల్సిన ఇండ్లలో ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్లు పూర్తి కాలేదని, ఆలస్యం చేయకుండా తక్షణమే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి రెడీ చేయాలన్నారు. 

నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణను వేగంగా కంప్లీట్ చేయాలన్నారు. రైతులకు పరిహారం కింద మంజూరైన చెక్కులను అందించాలన్నారు. వృద్ధుల సంరక్షణలో సమస్యలు తలెత్తితే చట్ట ప్రకారం ఆన్‌లైన్ లో అప్లికేషన్ చేయాలని అప్పుడే వారి పోషకులపై చర్యలు చేపడతామన్నారు. తెలంగాణ కేస్ మేనేజ్మెంట్ అండ్ మెయిన్‌టెనింగ్ సిస్టం పోర్టల్‌లో మాత్రమే అప్లికేషన్ చేసుకుని రసీదు తీసుకోవాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ,  స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఆర్డీవో అలివేలు, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు, విద్యుత్ ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ పీ ఆర్ దామోదర్, ఎస్ సి రహీముద్దీన్, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు.