కేసీఆర్ అసెంబ్లీకి రావాలి..ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు కాంగ్రెస్ నిరసన

కేసీఆర్ అసెంబ్లీకి రావాలి..ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందు కాంగ్రెస్ నిరసన

 సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు గజ్వేల్ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. గేట్ ముందు రెడ్ కార్పెట్, పూలతో కాంగ్రెస్ నాయకులు విన్నూత నిరసన తెలిపారు. కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని గేటు ముందు బైఠాయించారు కాంగ్రెస్ సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు ఆంక్షారెడ్డి. అసెంబ్లీ వెళ్లకుంటే కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు.

కృష్ణా జలాలు,పాలమూరురంగారెడ్డి అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాలను  బీఆర్ఎస్  బైకాట్ చేసింది. మొదటి రోజు అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ అటెండెన్స్ వేసి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఇదే బాటలో హరీశ్ రావు,కేటీఆర్ ఇతర ఎమ్మెల్యేలు సభనుంచి వాకౌట్ చేసి సెషన్ మొత్తం సమావేశాలను బైకాట్ చేస్తున్నట్లు చెప్పారు.

Also Read : సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్లు తొలగిస్తాం

ఈ క్రమంలో  గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ఫామ్ హౌస్  ముందు బైఠాయించిన నిరసనకు దిగారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.