ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్ ​మార్చండి

ట్రిపుల్ ఆర్ అలైన్​మెంట్ ​మార్చండి
  • భూమికి బదులు భూమి ఇవ్వండి
  • రాజీవ్ రహదారిపై నిర్వాసితుల ధర్నా

గజ్వేల్​, వెలుగు : గజ్వేల్ నియోజకవర్గంలో ట్రిపుల్ఆర్ అలైన్​మెంట్​మార్చాలని లేదంటే పూర్తిగా రద్దు చేయాలని బుధవారం భూ నిర్వాసితులు సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై మోకాళ్లపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రిపుల్ఆర్ నిర్మాణం వల్ల నియోజకవర్గ వ్యాప్తంగా 4750 ఎకరాల భూములను కొల్పోతున్నామని బాధితులు తెలిపారు. అభివృద్ధి పేరిట ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, ఔటర్ రింగ్ రోడ్డు పేరిట వేల ఎకరాల్లో రైతుల భూములు ప్రభుత్వం గుంజుకుందన్నారు.

ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి భూములను ట్రిపుల్ఆర్ పేరిట లాక్కోవాలని చూస్తుందన్నారు. భూములు కోల్పోయిన రైతులు మనస్తాపం చెంది సూసైడ్​చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఏ ప్యాకేజీలు తమకు వద్దని, రైతుల దగ్గర ఎంత భూమి తీసుకుంటే అంతే భూమి రైతులకు అందజేయాలని డిమాండ్​చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్​మెంట్​ఇస్తే తమ సమస్యను విన్నవించుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు.