కర్ణాటకలో మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు దుండగులు.జనవరి 23న సాయంత్రం బళ్లారి కంటోన్మెంట్ లోని మోడల్ హౌజ్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు . ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది.
కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో గాలి జనార్థన్ రెడ్డి బెంగళూరులోనే ఉన్నారు. బిల్డింగ్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారని గాలి జనార్థన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే నరా భరత్ రెడ్డి వర్గీయులే ఇంటికి నిప్పు పెట్టారని ఆరోపించారు.
ఈ విషయం తెలిసిన గాలి జనార్థన్ రెడ్డి బళ్లారి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యానర్ ఘర్షణ జరిగిన కొన్ని వారాల్లోనే ఈ ఘటన జరిగిందన్నారు. బళ్లారి ఎస్పీతో మాట్లాడానని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు.
ALSO READ : తిరుపతి లడ్డూకు కల్తీ నెయ్యి కేసులో చార్జ్షీట్..
జనవరి 2న మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై కాల్పులు కలకలం రేపాయి. జనార్దన్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు కాల్పులు జరిపారు. మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఫ్లెక్సీపై చెలరేగిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. గన్ మెన్ తుపాకీ లాక్కున్న సతీష్ రెడ్డి 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఎదురు కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మృతి చెందగా.. ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డికి బుల్లెట్ గాయమైంది.
మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డితో గాలి జనార్దన్ రెడ్డికి ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు ఆయన కొడుకు భరత్ రెడ్డితో కూడా కొనసాగుతోంది. సూర్యనారాయణ రెడ్డి ఫ్లెక్సీలు గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి కట్టడంతోనే వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే అతని అనుచరుల కుట్రల్ని సహించమని... అన్నిటికీ సమాధానం చెప్తామని అంటున్నారు గాలి జనార్దన్ రెడ్డి.
ALSO READ : MBBS సీటు కోసం తన కాలును తానే నరుక్కున్న కుర్రోడు
