ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో అవకతవకలు

ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో అవకతవకలు

ఉపాధ్యాయుల పరస్పర బదిలీల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. పరస్పర బదిలీల్లో అండర్ టేకింగ్ ఇచ్చి..డిఈఓల ద్వారా డిఎస్ఈ కి ఫార్వర్డ్ చేసినప్పటికీ పలువురి ఉపాధ్యాయుల పేర్లు బదిలీల జాబితాలో గల్లంతయ్యాయి. మూడు నెలలుగా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అవకతవకలపై  అగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు విద్యాశాఖ కార్యాలయాలను సంప్రదిస్తున్నారు. రెండున్నర వేలమంది పరస్పర బదిలీల్లోనే ఇంతటి అవకతవకలు జరగటంపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. తక్షణమే అన్ని జిల్లాల నుండి సమగ్రమైన సమాచారం తెప్పించుకుని అర్హులైన అందరికీ పరస్పర బదిలీ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.