నలందా యూనివర్సిటీ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ఫూర్తి నింపే ‘గేమ్ ఆఫ్‌ చేంజ్‌’

నలందా యూనివర్సిటీ బ్యాక్‌డ్రాప్‌లో.. స్ఫూర్తి నింపే ‘గేమ్ ఆఫ్‌ చేంజ్‌’

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న చిత్రం ‘గేమ్ ఆఫ్‌ చేంజ్‌’.జాతీయ, అంతర్జాతీయ నటీనటులతో మలయాళ దర్శకుడు సిధిన్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్‌ రాజశేఖర్‌, మీనా చాబ్రియా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో సినిమా విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్‌లో హీరో, నిర్మాత సిద్ధార్థ్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘ఒక శక్తివంతమైన జీవన విధానాన్ని తీర్చిదిద్దే అస్త్రం ఈ సినిమా. నలందా విశ్వవిద్యాలయ నేపథ్యంలో జరిగిన కొన్ని నిజ జీవితాల కథనాలతో దీన్ని రూపొందించాం.

కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే మనం జీవితంలో ఎదుగుతామని, జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలను, స్ఫూర్తిని ఈ చిత్రం నింపుతుంది’అని అన్నారు.  మరో నిర్మాత మీనా చాబ్రియా మాట్లాడుతూ ‘ఫస్ట్ కమ్యూనిటీ బేస్డ్ మూవీ ఇది. నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నాం. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని తెలిపారు.