ప్రేక్షకుల ఊహకందని స్క్రీన్‌ప్లేతో గేమ్ ఆన్

ప్రేక్షకుల ఊహకందని స్క్రీన్‌ప్లేతో గేమ్ ఆన్

రథం ఫేమ్ గీతానంద్(Geethanand), నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం గేమ్ ఆన్(Game On).  దయానంద్(Dayanand) దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గీతానంద్ మాట్లాడుతూ ‘ఇదొక యూనిక్ స్టోరీ.  లూజర్ నుంచి విన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎలా  మారాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది.ఈ చిత్ర దర్శకుడు దయానంద్ మా తమ్ముడు. మేమిద్దరం కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాం. ఆ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ హెల్ప్ అయింది.

రియల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌లో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.  యాక్షన్ సీక్వెన్సెస్ ఆకట్టుకుంటాయి. నేహా సోలంకి, నాకు మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. మధుబాల డిఫరెంట్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆదిత్య మీనన్ గ్రేషేడ్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్ మా తాత పాత్రలో ఇన్‌‌‌‌‌‌‌‌స్పైరింగ్  రోల్ చేశారు. ఇందులో క్రేజీ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రేక్షకుల ఊహకందని స్ర్కీన్‌‌‌‌‌‌‌‌ప్లే  ఉంటుంది.  బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌‌‌‌‌‌‌‌. అవుట్‌‌‌‌‌‌‌‌పుట్‌‌‌‌‌‌‌‌ బాగా వచ్చింది. ప్రేక్షకులు కొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ను ఫేస్ చేస్తారు. అలాగే మూడు కథలు విన్నా. త్వరలో అనౌన్స్ చేస్తా’ అని చెప్పాడు.