గాండీవధారి అర్జున టీజర్‌.. హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్

గాండీవధారి అర్జున టీజర్‌..  హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun tej) హీరోగా వస్తున్న స్పై యాక్షన్ త్రిల్లర్ మూవీ గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు(Praveen sattaru) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన గాండీవధారి అర్జున టీజర్‌ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఒక్కో సీన్, ఒక్కో షాట్ హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన కటౌట్ కు తగ్గ కంటెంట్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడు. రా ఏజెంట్ గా అదరగొట్టేశాడు వరుణ్. 

ఇక మిక్కీ జె మేయర్(Micky j mayer) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడ్రినరీగా ఉంది.  ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశారు మేకర్స్. సాక్షి వైద్య(Sakshi vaidhya) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్(SVCC) పై బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) నిర్మిస్తున్నారు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ను అందిస్తారో చూడాలి.