
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ అసలు సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తున్నదని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంగిశెట్టి జగదీశ్వర్ రావు విమర్శించారు. ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్న ఆయన టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ఎంతో శ్రమించినప్పటికి తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. గాంధీభవన్‌ను గాడ్సేభవన్లా మార్చేశారన్నారు. డబ్బున్నోళ్లకే టికెట్ల అని ప్రశ్నించారు. గాంధీభవన్ మెట్లు ఎప్పుడూ ఎక్కనివాళ్లకు టికెట్లు దక్కాయన్నారు. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వబోమని చెప్తూనే ఇచ్చారన్నారు.