గాంధీలో అరుదైన సర్జరీ.. ఉబ్బరం సమస్యకు క్లిష్టమైన ఆపరేషన్.. 43 ఏళ్ల మహిళను కాపాడిన వైద్యబృదం

గాంధీలో అరుదైన సర్జరీ.. ఉబ్బరం సమస్యకు క్లిష్టమైన ఆపరేషన్.. 43 ఏళ్ల మహిళను కాపాడిన వైద్యబృదం

పద్మారావునగర్, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు గాంధీ హాస్పిటల్​ డాక్టర్లు క్లిష్టమైన సర్జరీ నిర్వహించి ప్రాణాలు కాపాడారు. భారీ ప్లీహవృద్ధి(స్ప్లీన్ పెరగడం), ప్యాన్సైటోపీనియా వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న 43 ఏళ్ల మహిళపై అరుదైన స్ప్లీనెక్టమీ సర్జరీని విజయవంతంగా చేశారు. సికింద్రాబాద్‌‌‌‌ వారాసిగూడకు చెందిన బాధితురాలు మూడు నెలలుగా కడుపునొప్పి, నెల రోజులుగా కడుపు ఉబ్బరం సమస్యలతో గాంధీ హాస్పిటల్​ను ఆశ్రయించింది. 

వైద్య పరీక్షల్లో ఆమె ప్లీహం భారీగా పెరిగి నాభి కింద వరకు విస్తరించినట్లు గుర్తించారు. సీనియర్ సర్జన్ డాక్టర్​ సునీల్‌‌‌‌, అనస్థీషియా నిపుణుడు డాక్టర్​ మురళి ఆధ్వర్యంలోని వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా సర్జరీ చేసి.. 2.8 కిలోల బరువున్న భారీ ప్లీహాన్ని తొలగించారు. ఆమె క్రమంగా కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు.