పద్మారావునగర్, వెలుగు: కొన్ని రోజులుగా గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ, మానసిక స్థితి సరిగా లేని ఆరుగురు అనాథలను పోలీసులు యాప్రాల్‌లోని ‘సెకండ్ చాన్స్ మిషన్ హాస్పిటల్’ ఆశ్రయానికి తరలించారు. కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే చిలకలగూడ పోలీసులను సంప్రదించాలని ఏసీపీ కె.శశాంక్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.వాణి, డాక్టర్ నవీన్, ఏసీపీ శశాంక్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో రామకృష్ణ, సెకండ్ ఛాన్స్ హాస్పిటల్ కోఆర్డినేటర్ మెల్విన్ పాల్గొన్నారు.
