
మరోసారి గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట సిబ్బంది మరోసారి విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. జీతాలు పెంచినట్లు చెప్పిన ప్రభుత్వం మూడు నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆరోపించారు. పెంచిన జీతాలు, కరోనా స్పెషల్ అలవెన్స్‌ను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేషంట్ కేర్, ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులు ఆస్పత్రి ఆవరణలోనే బైటాయించి నిరసన చేపట్టారు.