ఆరు గ్యారంటీలతో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు భయం పట్టుకుంది: గండ్ర సత్యనారాయణ

ఆరు గ్యారంటీలతో  బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు భయం పట్టుకుంది: గండ్ర సత్యనారాయణ

భూపాలపల్లి అర్బన్‌‌‌‌, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని ఆ పార్టీ భూపాలపల్లి క్యాండిడేట్‌‌‌‌ గండ్ర సత్యనారాయణరావు చెప్పారు. భూపాలపల్లి మండలంలోని అజంనగర్‌‌‌‌లో ఆదివారం ప్రారంభించిన ప్రజా దీవెన యాత్రలో ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్‌‌‌‌ ఆరు గ్యారంటీ స్కీమ్‌‌‌‌లు ప్రకటించగానే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌‌‌‌ హయాంలో పోడు రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రజా శ్రేయస్సు కాంగ్రెస్‌‌‌‌తోనే సాధ్యమన్నారు. అజంనగర్‌‌‌‌లో మొదలైన యాత్ర నాగారం, రాజీవ్‌‌‌‌ నగర్ మీదుగా గొల్లబుద్ధారం వరకు సాగింది. అనంతరం పలువురు లీడర్లు కాంగ్రెస్‌‌‌‌లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో గాజర్ల అశోక్‌‌‌‌, ఆకుల మహేందర్‌‌‌‌, ఐత ప్రకాశ్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.