రోడ్లపై గణేశ్ మండపాలు అనుమతించం : సీపీ సాయిచైతన్య

రోడ్లపై గణేశ్ మండపాలు అనుమతించం : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్లపై గణేశ్​ మండపాలను అనుమతించబోమని సీపీ సాయి చైతన్య తెలిపారు. శనివారం తన ఆఫీస్​లో వినాయక చవితి వేడుకలపై ఆఫీసర్స్​తో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. గణేశ్​ మండపాలకు వలంటీర్లను నియమించుకొని, ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పర్మిషన్ లేకుండా లౌడ్​ స్పీకర్లు పెట్టొద్దన్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రార్థనా మందిరాలకు దగ్గరగా లౌడ్ స్పీకర్స్​కు అనుమతి లేదన్నారు. 

సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్ ఏర్పాటు చేయాలని ఎస్​హెచ్వోలను ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టాలన్నారు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్​ స్పీకర్లు, పటాకులు, బాణాసంచా కాల్చకుండా పర్యవేక్షించాలన్నారు. డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీలు రాజా వెంకట్​రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్​రెడ్డి, స్పెషల్  బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ సతీశ్​కుమార్, జిల్లాలోని సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.