నెమ్మదిగా సాగుతున్న నిమజ్జనం

నెమ్మదిగా సాగుతున్న నిమజ్జనం

హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనం వేడుక ప్రారంభమైంది. ఎన్టీ ఆర్ మార్గ్ లోకి నెక్ల్స్ రోడ్ మీదుగా నిన్న రాత్రి వచ్చిన వినాయక విగ్రహాలకు ఇప్పుడు నిమజ్జనం జరుగుతోంది. ఇదిలా ఉండగా నిమజ్జనం ఆలస్యం కావడంతో భక్తులు పలురకాలుగా స్పందిస్తున్నారు . కిలోమీటర్ల మేర విగ్రహాలు బారులు తీరడంతో ఈ సమస్య తలెత్తుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భక్తులు, ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాగే కొనసాగితే జంట నగరంలో ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ ల వద్దకు అంతకంతకూ పెరుగుతూ వస్తోన్న గణనాథుల నిమజ్జనం ఈ రోజు మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రధానంగా అధికారుల పర్యవేక్షణ లోపించడమేనని భక్తులు ఆరోపిస్తున్నారు.