సెప్టెంబర్ 17న గణేశ్​ నిమజ్జనం

సెప్టెంబర్ 17న గణేశ్​ నిమజ్జనం

బషీర్ బాగ్, వెలుగు: బేగంబజార్ లో బుధవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తాత్కాలిక ఆఫీసును ప్రారంభించారు. ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ రావినూతల శశిధర్, బీజేపీ నాయకురాలు మధవిలత పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి ఆఫీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 

దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 7న వినాయక చవితి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 17న(చతుర్దశి) హైదరాబాద్​లో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఉంటుందని వెల్లడించారు. మండపాల నిర్వాహకులు ఎలాంటి పర్మిషన్​తీసుకోవాల్సిన అవసరం లేదని, స్థానిక పీఎస్​లో తెలియజేస్తే చాలన్నారు. గ్రేటర్​పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు నూతన కన్వీనర్లను, 8 మున్సిపల్ కార్పొరేషన్లలో కొత్త కమిటీలను నియమించామని చెప్పారు.