గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో బార్లు, వైన్స్, రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు నగర పోలీసులు. సెప్టెంబర్ 6న సిటీలో 36 గంటలపాటు అన్ని మద్యం దుకాణాలను బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సీపీ సీవీ ఆనంద్ నోటిఫికేషన్ ప్రకారం..సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటలనుంచి సెప్టెంబర్ 7 సాయంత్రం 6 గంటల వరకు 36 గంటలపాటు హైదరాబాద్ జంట నగరాల్లో వైన్సులు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే రిజస్టర్డ్ క్లబ్బులు, 5స్టార్ హోటళ్లకు ఈనిబంధనలు వర్తించవని తెలిపారు.
మరోవైపు సెప్టెంబర్6న జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. శాంతిభద్రతలకోసం నగరంలోని పోలీసులతోపాటు, రాపిడ్ యాక్షన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దింపారు. మసీదులు, ఆలయాల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, జేబు దొంగతనం, ఈవ్-టీజింగ్ ,చైన్ స్నాచింగ్ వంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని సీపీ సీవీ ఆనంద్ పోలీసులను ఆదేశించారు.
►ALSO READ | GST మార్పులతో తగ్గనున్న ACలు, TVలు, వాషింగ్ మెషిన్ల రేట్లు.. దేనిపై ఎంతంటే..?
