GST మార్పులతో తగ్గనున్న ACలు, TVలు, వాషింగ్ మెషిన్ల రేట్లు.. దేనిపై ఎంతంటే..?

GST మార్పులతో తగ్గనున్న ACలు, TVలు, వాషింగ్ మెషిన్ల రేట్లు.. దేనిపై ఎంతంటే..?

GST On Consumer Durables: స్వాతంత్య్ర దినోత్సవం రోజుల ప్రధాని మోడీ ప్రకటించినట్లుగానే తాజా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. కేవలం 5 శాతం, 18 శాతం జీఎస్టీ రేట్లను కొనసాగిస్తూ.. 12 శాతం, 28 శాతం జీఎస్టీ స్లాబ్స్ తీసేయటంతో అనేక ఉత్పత్తుల రేట్లు తగ్గుతున్నాయి. దీంతో గృహోపకరణాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు రేట్లు తగ్గుతున్నట్లు వెల్లడైంది. 

సెప్టెంబర్ 3న సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఏసీలు, పెద్ద స్కీన్ ఉండే టీవీలు, రెఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్లపై ఉన్న జీఎస్టీని ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతం స్లాబ్ రేటు కిందకు తీసుకొచ్చింది. దీంతో రానున్న దసరా, దీపావళి సీజన్లో ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కునే ప్రజలకు భారీ తగ్గింపులు అందుబాటులోకి రాబోతున్నాయి. టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్ రేట్లు మోడళ్లను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు తగ్గొచ్చని తెలుస్తోంది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏసీల రేట్లు రూ.15వందల నుంచి రూ.2వేల 500 వరకు తగ్గుతాయని తెలుస్తోంది. అయితే మోడళ్ల ప్రకారం ఇది మారుతుంటుంది. ఇకపోతో 32 ఇంచెస్ కంటే చిన్న టీవీలపై జీఎస్టీని 5 శాతంగా నిర్ణయించటం పెద్ద గేమ్ చేంజర్ అని అంటున్నారు వ్యాపారులు. దీంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ కొనే టీవీ మోడళ్ల రేట్లు తగ్గుతాయి. 

ప్రస్తుతం దేశంలో వానలు, అకాల వర్షాల కారణంగా ఏసీలు అమ్మే కంపెనీలైన వోల్టాస్, బ్లూస్టార్, హావెల్స్ ఆదాయం 35 శాతం వరకు తగ్గిన వేళ జీఎస్టీ రేట్ల తగ్గింపు ఊతం ఇస్తుందని సంస్థలు భావిస్తున్నాయి. మెుత్తానికి ప్రధాని మోడీ అందించిన దీపావళి గిఫ్ట్ పెద్ద ఆదాయాలను కంపెనీలకు తెచ్చిపెట్టడంతో పాటు మధ్యతరగతికి కొనుగోళ్లపై సేవింగ్స్ పెంచనుంది. 

ALSO READ : మార్కెట్లలో జీఎస్టీ తగ్గింపుల జోరు..

రేట్లు తగ్గాక మెుబైల్ ఫోన్స్ కొనాలనుకుంటున్న ప్రజలకు జీఎస్టీ మార్పుల వల్ల ఎలాంటి ఊరట లభించ లేదు. గతంలో 18 శాతం జీఎస్టీ రేటు కింద ఉన్న మెుబైల్ ఫోన్లను కేంద్రం ఈ సారి కూడా అదే రేటు కింద కొనసాగిస్తోంది. దీంతో మెుబైల్ ఫోన్ల రేట్లు తగ్గే అవకాశం లేదని తేలిపోయింది.