Markets GST Rally: మార్కెట్లలో జీఎస్టీ తగ్గింపుల జోరు.. ఆటో, ఇన్సూరెన్స్ స్టాక్స్ ర్యాలీ..

Markets GST Rally: మార్కెట్లలో జీఎస్టీ తగ్గింపుల జోరు.. ఆటో, ఇన్సూరెన్స్ స్టాక్స్ ర్యాలీ..

Stock Market Up: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత చేసిన సంస్కరణల ప్రకటనతో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు మెగా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఉదయం 10.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 440 పాయింట్ల లాభంతో ఉండగా.. నిఫ్టీ సూచీ 120 పాయింట్లకు పైగా లాభంలో కొనసాగుతోంది. వాస్తవానికి ట్రేడింగ్ ప్రారంభంలో సూచీలు మరింత లాభాల్లో ఉన్నప్పటికీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గు చూపటంతో ఆ తర్వాత కొంత తగ్గాయి.

నేడు మార్కెట్లలో ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆటో, సిగరెట్స్, ఫుట్ వేర్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన స్టాక్ లాభాలతో ముందుకు సాగుతున్నాయి. 

* ముందుగా ఇన్సూరెన్స్ పై ప్రభుత్వం జీఎస్టీని సున్నాకు తగ్గించటంతో ఈ రంగంలోని హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఎల్ఐసీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, న్యూ ఇండియా అసురెన్స్, ఐసిఐసిఐ లంబార్డ్, స్టార్ హెల్త్ స్టాక్ 3 శాతం వరకు పెరుగుదలను నమోదు చేశాయి. దీనివల్ల పాలసీదారులపై భారం తగ్గొచ్చని అంటున్నప్పటికీ బ్రోకరేజీలు మాత్రం ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ వల్ల ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. 

* ఇక ఒటో రంగానికి వస్తే ప్రధానంగా టూవీల్స్, చిన్న కార్లపై తగ్గింపులు ఉంటాయని తెలుస్తోంది. దీంతో ఐషర్ మోటార్స్, మారుతీ సుజుకీ, టీవీఎస్, హీరో మోటార్స్, ఎస్ కార్ట్స్ కుబోటా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు భారీగా లాభపడ్డాయి. 

ALSO READ : ఏపీ తెలంగాణలో తగ్గిన గోల్డ్ రేట్లు..

* మరో పక్క కన్జూమర్ డ్యూరబుల్స్ పై జీఎస్టీ రేట్ల కత్తిరింపుతో హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, బాటా, వర్ల్ పూల్, నెస్లే, వోల్టాస్, హావెల్స్, రిలాక్సో, కోల్ గేట్ పామోలిన్, డాబర్, ఐటీసీ, డిక్సన్ టెక్, యాంబర్ ఎంటర్ ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వంటి కంపెనీలు ఇంట్రాడేలో దూసుకుపోతున్నాయి. 

* వాస్తవానికి పొగాకు ఉత్పత్తులపై సిన్ టాక్స్ కింద జీఎస్టీని 40 శాతానికి పెంచినప్పటికీ ఈ రోజు మార్కెట్లో వీటికి సంబంధించిన స్టాక్స్ పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో ఐటీసీ, గాడ్ఫ్రేపిలిప్ స్టాక్స్, వీఎస్టీ ఇండస్ట్రీస్ షేర్లు 4 శాతం వరకు పెరిగాయి. కేంద్రం సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా, జర్థా, బీడీ వంటి ఉత్పత్తులను 40 శాతం పన్నుల కిందికి తీసుకొచ్చింది. అయితే ఈ నిర్ణయం పొగాకు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలకు సానుకూలంగా లేదా ఎలాంటి ప్రభావం చూపని విధంగా ఉండొచ్చని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి.