స్కూటీతో ఏటీఎం మెషిన్ లాక్కెళ్లే యత్నం

స్కూటీతో ఏటీఎం మెషిన్ లాక్కెళ్లే యత్నం
  • ఏటీఎంలో చోరీకి యత్నించిన ముగ్గురు యువకుల అరెస్ట్
  • ఖమ్మం జిల్లాలో ఘటన


కారేపల్లి, వెలుగు: కారేపల్లిలోని ఇండియా వన్​ఏటీఎంలో సోమవారం రాత్రి చోరీకి యత్నించిన ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్​చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం రూరల్​ ఏసీపీ బస్వారెడ్డి బుధవారం వెల్లడించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని గేట్​కారేపల్లి గ్రామానికి చెందిన కందుల రాజు, నిమ్మల సందీప్​, నాగారపు చందు స్కూటీపై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కారేపల్లి ప్రభుత్వ జూనియర్​కాలేజి ఎదురుగా ఉన్న ఏటీఎం దగ్గరకు వెళ్లారు. ముఖానికి ఖర్చీఫ్​లు కట్టుకుని ఏటీఎం గదిలోకి వెళ్లి ముందుగా లాకర్​బాక్స్ పై ఉండే సామగ్రి ధ్వంసం చేశారు. లాకర్​బాక్స్​కు తాడుకట్టి స్కూటీతో బయటికి లాగేందుకు ప్రయత్నించారు. మూడు టన్నుల బరువుండే ఏటీఎం క్యాష్​లాకర్​బయటికి రాకపోవడంతో మరో మార్గం ఆలోచించారు. ముగ్గురిలో ఒకడైన కందుల రాజు ట్రాక్టర్​డ్రైవర్​గా చేసేవాడు. అతను మేకలతండాలో ఓ బొలెరో యజమాని వద్దకు వెళ్లి  కిరాయి ఉంది బొలెరో కావాలని చెప్పి తీసుకున్నాడు. ఏటీఎం లాకర్​కు తాడు కట్టి బొలెరో తో దాన్ని బయటికి లాగారు. లాకర్​బాక్సును బొలెరోలో ఎక్కించుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో అక్కడే విడిచి వెళ్లారు.  ఏటీఎం గదిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. 24 గంటల్లోనే ముగ్గురినీ అరెస్ట్​ చేశారు. నిందితులు వాడిన స్కూటీ, బొలెరోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ముగ్గురు నిందితుల్లో ఇద్దరు స్టూడెంట్లు. గవర్నమెంట్​జూనియర్​కాలేజీలో ఒకేషనల్​కోర్సు చదువుతున్నారు. మరొకరు ట్రాక్టర్​డ్రైవర్. తాగుడుకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చోరీకి యత్నించారు. కేసును ఛేదించిన సీఐ ఆరిఫ్​అలీఖాన్, ఎస్సై కుశకుమార్​కు సీపీ రివార్డ్​అందజేస్తారని ఏసీపీ చెప్పారు. 

ఎస్బీఐలో చోరీ19 లక్షలు ఎత్తుకెళ్లిన్రు
భద్రాచలం:  భద్రాచలం డివిజన్‍ దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం ఎస్బీఐలో చోరీ జరిగింది. దోపిడీ దొంగలు మంగళవారం అర్ధరాత్రి బ్యాంకు వెనుక భాగంలో ఉన్న గేటులో నుంచి ప్రవేశించి గ్యాస్ కట్టర్‍తో లాకర్‍ తెరిచారు. అందులో ఉన్న నగదు రూ. 19 లక్షలు తీసుకెళ్లారు. పక్కనే ఉన్న బంగారం లాకర్‍ను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సీసీ టీవీ కెమెరా ఫుటేజ్‍ డీవీఆర్‍ను వెంట తీసుకెళ్లారు. బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం బ్యాంకు సిబ్బంది తాళాలు తీసి లోపలికి వెళ్లిన వెంటనే వెనుక భాగం తలుపులు తెరిచి ఉండటం గమనించారు. దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లుకు సమాచారం ఇవ్వగా ఆయన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకులో దొంగల వేలిముద్రలు సేకరించారు. డాగ్‍స్వ్కాడ్‍తో చుట్టు పక్కల తనిఖీ చేశారు.