బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఏర్పడిన బీసీ జేఏసీలో చీలికలు లేవని చైర్మన్ ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. శనివారం కాచిగూడలో పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ ఉద్యమం ఏ ఒక్కరిది కాదని, జేఏసీలో ఉన్న వారందరూ మార్గదర్శకులేనని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కావాలంటే కేంద్రం రాజ్యాంగాన్ని సవరణ చేయాలన్నారు. ఇందుకోసం ఆదివారం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద బీసీల న్యాయ సాధన దీక్ష తలపెట్టినట్లు తెలిపారు.
