జనగామ అర్బన్, వెలుగు : నవభారత నిర్మాణానికి కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చెప్పారు. వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని శనివారం జిల్లా కేంద్రంలోని నెహ్రు పార్క్ ఆవరణలో కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మేరా యువ భారత్ వరంగల్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ హాజరై వల్లభాయ్‌పటేల్, భరతమాత ఫొటోలకు నివాళులు అర్పించారు.
అనంతరం ఐక్యత పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వరంగల్ డిప్యూటీ డైరెక్టర్చింతల అన్వేశ్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీవో గోపిరామ్ పాల్గొన్నారు.
