చిన్నచింతకుంట, వెలుగు: పేదల జీవితాల్లో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని దమగ్నాపూర్ గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారురాలు ఫ్యామిలీతో కలిసి ప్రారంభించారు. గృహ ప్రవేశం చేసిన దంపతులకు వస్ర్తాలను అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తోందని తెలిపారు. అనంతరం కౌకుంట్ల మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ స్టూడెంట్లకు షూస్, టై, బెల్టులను పంపిణీ చేశారు. స్కూల్ లో ఆర్వో ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు.
