రోజువారీ పనుల్లో ఇంపార్టెంట్ అప్డేట్స్, మరీ ముఖ్యంగా హెల్త్ అప్డేట్స్ కోసం స్మార్ట్ వాచ్ వాడతారు. అయితే దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కొంతమందికి స్మార్ట్ వాచ్ వల్ల చర్మ సమస్యలు రావొచ్చు. అలాంటివాళ్లు వాచ్‌ను బిగుతుగా పెట్టుకోకూడదు. అలాగే కొందరికి స్మార్ట్ వాచ్‌ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల తలనొప్పి లేదా వికారం లాంటి సమస్యలు వస్తాయి.
అలాంటి సమస్యలు వస్తుంటే స్మార్ట్ వాచ్ వాడకం తగ్గించడం బెటర్. చాలామందికి నిద్రలేమి సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి నిద్రపోయే ముందు స్మార్ట్ వాచ్ తీసేయాలి. నిజానికి స్మార్ట్ వాచ్ అనేది హెల్త్‌ని బెటర్ చేసేందుకు ఉపయోగపడే సాధనం. కానీ, దాన్ని అతిగా వాడితే అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
