కరీంనగర్ క్రైం,వెలుగు: కమిషనరేట్ పరిధిలోని కరెంట్ మోటార్లలో కాపర్ వైర్‌చోరీ చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ గౌస్ ఆలం శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
కరీంనగర్ లోని కట్టరాంపూర్ కు చెందిన మానుపాటి శేఖర్, చొప్పదండి విజయనగరం కాలనీకి చెందిన మానుపాటి సంజీవ్, రామగిరి మండలం బేగంపేటకు చెందిన ఉండాటి మహేశ్, ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్ కు చెందిన బోదాసు కుమార్, కమాన్ పూర్ మండలం పెంచికల్ పేటకు చెందిన సాగర్ల రంజీత్, చొప్పదండి సంతోష్‌నగర్ కు చెందిన బొడిగె సంపత్ పలు గ్రామాల్లో 12 కరెంట్ మోటార్లలోని కాపర్‌వైర్, కొన్ని పశువులను ఎత్తుకెళ్లారు.
చొప్పదండిలోని గుమ్లాపూర్ చౌరస్తా వద్ద నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 3 క్వింటాళ్ల కాపర్ వైరు, బోలెరో, అశోక్‌లేల్యాండ్ వాహనాలు, బైక్స్వాధీనం చేసుకున్నట్లు సీపీ పేర్కొన్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, మానకొండూర్ సీఐ సంజీవ్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
