వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి  : మంత్రి పొన్నం

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి  : మంత్రి పొన్నం

ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 17న మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. కాకతీయ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ క్యాంప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు.

ఎల్కతుర్తి గ్రామపంచాయతీ ఆవరణలో శిబిరం కోసం జరుగుతున్న పనులను మంత్రి శనివారం సాయంత్రం పరిశీలించారు. డీఎంహెచ్ వో అప్పయ్య, ఎంజీఎం సూపరింటెండెంట్ హరీశ్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంధ్యతో మాట్లాడి, పలు సూచనలిచ్చారు. ఏఎంసీ చైర్మన్ సంతాజీ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, నాయకులు ఉన్నారు.