జూబ్లీహిల్స్, వెలుగు: ఫిలింనగర్లో ఓవర్ స్పీడ్తో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి పల్టీకొట్టింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలనీ రోడ్ నంబర్ 12 చెందిన ముస్కాన్ (24) తన ఫ్రెండ్ను కలవడానికి శుక్రవారం అర్ధరాత్రి ఓవర్ స్పీడ్తో లోటస్ పాండ్ నుంచి ఎన్టీవీ వైపు వెళ్తోంది.
మార్గమధ్యలో కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అప్పటికే సదరు యువతి అక్కడ్నుంచి వెళ్లిపోగా, ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
