కేటీఆర్.. రాజకీయాల నుంచి తప్పుకుంటారా : కేకే.మహేందర్ రెడ్డి

కేటీఆర్.. రాజకీయాల నుంచి తప్పుకుంటారా :  కేకే.మహేందర్ రెడ్డి

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంది కాబట్టే జూబ్లీహిల్స్ ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారని కాంగ్రెస్​ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్​చార్జి కేకే.మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 

బీఆర్​ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్ ​కేటీఆర్ తన యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెఫరెండమని అన్నారని.. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే నీ స్థాయి ఏంటని, ఇకనైనా అహంకారం తగ్గించుకోవాలని సూచించారు. 

కాంగ్రెస్​పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ వెలుముల స్వరూప, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్లు రెడ్డి నాయక్, వేముల రవి పాల్గొన్నారు.