- సబ్ కలెక్టర్ వికాస్ మహతో
బోధన్, వెలుగు: అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా నిత్యభిక్ష కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని సబ్ కలెక్టర్ వికాస్ మహతో తెలిపారు. శనివారం బోధన్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వాములకు రెండో రోజు నిత్యభిక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అయ్యప్ప స్వాములకు ప్రతియేటా నిర్వహించే అన్నదానమే మహాదానమన్నారు.
సమాజంలోని ప్రతి వ్యక్తి సేవాభావం కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ సంతోష్ శర్మ, అయ్యప్ప సేవా ట్రస్ట్ కార్యదర్శి చక్రవర్తి, అన్నదాన కార్యక్రమ నిర్వాహకులు కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, పావులూరి వెంకటేశ్వరరావు, ముక్కు చిన్న బ్రహ్మయ్య గౌడ్, ప్రసాద్, ఎన్. రమేశ్, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.
