కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ, మహారత్న కంపెనీ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 05 .
పోస్టులు: 124. (మేనేజ్మెంట్ ట్రైనీ).
విభాగాలు: కెమికల్ 05, సివిల్ 14, కంప్యూటర్ 04, ఎలక్ట్రికల్ 44, ఇనుస్ట్రుమెంటేషన్ 07, మెకానికల్ 30, మెటలర్జీ 20.
ఎలిజిబిలిటీ: కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగాల్లో ఎందులోనైనా 65 శాతం మార్కులతో (ఇన్స్టిట్యూట్/యూనివర్సిటీ ఇచ్చిన వెయిటేజీతో సంబంధం లేకుండా అన్ని సెమిస్టర్ల సగటు) ఇంజనీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. 1997, డిసెంబర్ 05 కంటే ముందు జన్మించిన వారై ఉండకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా డిపార్ట్మెంటల్ అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 45 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 15.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1050. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్ఎం, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు రూ.300.
లాస్ట్ డేట్: డిసెంబర్ 05.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ ఎగ్జామ్
కంప్యూటర్ బేస్డ్ టెస్టును 2026, జనవరి/ ఫిబ్రవరి నెలల్లో నిర్వహించే అవకాశం ఉన్నది. ఆన్లైన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్–I: డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ - 100 మార్కులు, 40 నిమిషాలు, పార్ట్ –II: ఆప్టిట్యూడ్ టెస్ట్ - 100 మార్కులు, 80 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు అర్హత సాధించాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రతి విభాగంలో అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను 1: 3 నిష్పత్తిలో కేటగిరీల వారీగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు.
ఫైనల్ మెరిట్: కంప్యూటర్ బేస్డ్ టెస్టుకు 75 శాతం వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్‌కు 10 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.
పూర్తి వివరాలకు sail.co.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
