వికారాబాద్ మార్కెట్ చైర్మన్గా చాపల శ్రీనివాస్

వికారాబాద్ మార్కెట్ చైర్మన్గా చాపల శ్రీనివాస్
  •  అసెంబ్లీ స్పీకర్​ను కలిసి కృతజ్ఞత​

వికారాబాద్, వెలుగు: వికారాబాద్​ మార్కెట్​కమిటీ చైర్మన్​గా కొత్తగా ఎన్నికైన చాపల శ్రీనివాస్​ముదిరాజ్​శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​కుమార్​ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన కష్టాన్ని గుర్తించి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని, రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి, చామల రఘుపతి రెడ్డి పాల్గొన్నారు.