మావోల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

మావోల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

సులభంగా డబ్బులు సంపాదించాలని మావోయిస్టుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ మావోయిస్టుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తుపాకులతో బెదిరించి దారి దోపిడీలు చేస్తున్న ముఠాలోని నలుగురు సభ్యులను యాదాద్రి ఎన్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. సీపీ మీడియాతో మాట్లాడుతూ  పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిని తెలిపారు. అతనికి తుపాకీ తయారు చేయడం కూడా తెలుసునన్నారు. అశోక్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. 

అదుపులోకి తీసుకున్న నలుగురు నిందితులు పిట్టల శ్రీనివాస్, వాళ్ళలా నగమళ్లయ్యా, ఎదవల్లి శ్రీనివాస్ రెడ్డి, గంగపురం స్వామి గతంలో జనశక్తి పార్టీలో పనిచేశారని చెప్పారు.  వీరంతా  యాదాద్రి శివారు ప్రాంతాల్లో దారి దోపిడీలు, షాపుల్లో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల నుంచి మూడు తుపాకులు, ఒక నాటు తుపాకీ, 6 డిటోనేటర్లు, 15గ్యాస్ సిలిండర్లు, బులెట్లలో వాడే పౌడర్ 40గ్రాములు, మావోయిస్టు లెటర్ హెడ్స్, డ్రిల్లింగ్ మెషిన్, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల పైన  మారణాయుధాల చట్టం ప్రకారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామన్నారు సీపీ మహేశ్ భగవత్.