
సుల్తానాబాద్, వెలుగు: గుప్త నిధుల కోసం ఓ ముఠా ఆలయంలోని శివలింగాన్ని పెకలించిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామంలో పురాతన శివకేశవ ఆలయం ఉంది. గ్రామానికి కిలోమీటర్ దూరంలో మానేరు వాగు ఒడ్డున ఉంటుంది. ఈ ఆలయం పక్కనే అతి పురాతనమైన మరో శివలింగం ఉన్న చిన్న గుడి ఉంటుంది.
ఈ గుడిలోకి చొరబడి గుప్తనిధుల కోసం శివలింగాన్ని పెకిలించారు. ఊరికి దూరంగా ఉండడాన్ని అదునుగా చేసుకొని ఆగంతకులు శివలింగం కింద తవ్వకాలు జరిపారు. చాలా రోజుల తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. గ్రామస్తులు ఇటీవల పోలీసుల దృష్టికి సైతం తీసుకువెళ్లగా వారు విచారణ జరిపినట్టు తెలుస్తోంది.